సద్ది కట్టుకొని వచ్చింది ఎందుకు…? ఎవరికోసం…?

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ప్రజలకు, బీజేపీ పార్టీ శ్రేణులకు దూరం అవుతున్న తీరు…?

ఈటల వ్యవహారంతో నిరాశగా బీజేపీ పార్టీ కార్యకర్తలు…?

హుజరాబాద్ లో ఉండే నేను మల్కాజిగిరి ప్రజల కోసం సద్ధి కట్టుకొని వచ్చిన… పైసలతో గెలవలేదు… ప్రజల ఆశీస్సులతో గెలిచిన.. ఈ మాటలు అన్నది స్వయంగా సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఈటల రాజేందర్. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా బీజేపీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్ తీరుతో .. ప్రస్తుతం బీజేపీ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈటల రాజేందర్ ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తూ అసలైన బీజేపీ పార్టీ శ్రేణులకు దూరమవుతూ ప్రజల సమస్యలపై పోరాడటం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ ప్రసంగంలో ఏ రాజకీయ పార్టీ నాయకుని విమర్శించిన దాఖలాలు లేవు.. కేవలం సంబంధాలు.. సత్సంబంధాలు కొనసాగించాలని ఆశతో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో ఘోరంగా ఓడిపోయిన ఈటల రాజేందర్ ఆ తర్వాత 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందిన నాటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దగ్గరవుతూ రాజకీయ ప్రసంగాల్లో కూడా విమర్శలకు తావు లేకుండా మాట్లాడుతున్న తీరు నిజమైన బీజేపీ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ ను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం పోరాడడం లేదని స్వలాభం కోసం ఇతర పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగించడం కోసం పాటుపడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని సామాన్య బీజేపీ కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

హుజురాబాద్ కాదని మల్కాజిగిరిలో పాగా వేయాలనుకుంటున్నారా..?

హుజరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు నాటి నుంచి హుజురాబాద్ ప్రజలకు దూరంగా ఉంటూ.. మల్కాజ్గిరి లో పాగా వేయాలనుకుంటున్నట్టు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేయాలనుకునే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. కానీ అందుకు ఆయన బీజేపీ పార్టీ శ్రేణులకు, ప్రజలకు దగ్గర కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందాలని, వారిని రాజకీయంగా విమర్శించకుండా సత్సబంధాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది ఇదే అనుమానాలను సామాన్య బీజేపీ పార్టీ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ని మనందరికీ బాస్ అనడం… అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు దగ్గరవుతూ వారి ప్రతి కార్యక్రమంలో హాజరవుతూ నిజమైన బీజేపీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు బీజేపీ పార్టీ శ్రేణులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

ఈటల రాజేందర్ తీరుతో బీజేపీ పార్టీకి నష్టం తో పాటు నమ్మి ఓటు వేసిన ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారా…?

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీరుతో. బీజేపీ పార్టీ నేతలు కూడా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈటెల రాజేందర్ తీరుతో కాషాయ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు బీజేపీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో నమ్మి ఓటు వేసిన మల్కాజిగిరి ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ప్రజల తరఫున ప్రశ్నించడం మానేసి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా మాట్లాడడంతో తమ సమస్యలను ఎవరు ప్రశ్నిస్తారని, ఎవరు పరిష్కరిస్తారని మల్కాజిగిరి ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Our Facebook Page

“Inspiring BhaArath Enlightening Minds”Visit Related Post